కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..

చైనాలోని వుహన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. కంటికి కనిపించిన ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రపంచానికి పెద్దన్న అయిన అగ్రరాజ్యం పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఇందుకు నిదర్శనంగా మరే దేశంలోనూ లేనన్ని పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ.. అమెరికన్లు ఓ వింత అలవాటును ప్రదర్శిస్తున్నారట. కరోనా కారణంగా తమకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరేమోనన్న భయంతో తమ […]

కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..
Follow us

|

Updated on: Apr 17, 2020 | 3:47 PM

చైనాలోని వుహన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. కంటికి కనిపించిన ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రపంచానికి పెద్దన్న అయిన అగ్రరాజ్యం పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఇందుకు నిదర్శనంగా మరే దేశంలోనూ లేనన్ని పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ.. అమెరికన్లు ఓ వింత అలవాటును ప్రదర్శిస్తున్నారట. కరోనా కారణంగా తమకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరేమోనన్న భయంతో తమ స్పెర్మ్(వీర్యం)ను బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. దీనితో స్పెర్మ్ కిట్ల అమ్మకాలు అక్కడ ఓ రేంజ్‌లో జోరందుకున్నాయని ది డైలీ బీస్ట్ అనే పత్రిక ఓ కథనం ప్రచురించింది.

అసలు ఎందుకు ఇదంతా అంటే.? కరోనా వైరస్ కారణంగా తమ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అమెరికన్లలో భయం పట్టుకుంది. అందుకే ఒక్కసారిగా స్పెర్మ్ కిట్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే సెక్స్ ద్వారా కరోనా వ్యాపించదని ఇదివరకే ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. అంతేకాకుండా కరోనాతో సెక్స్ సామర్ధ్యం కానీ.. స్పెర్మ్ కౌంట్ గానీ తగ్గుతుందని స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా కూడా అమెరికన్లలో తమ వీర్యం కౌంట్ తగ్గుతుందేమోనన్న భయం పట్టుకుందట. దానితోనే స్పెర్మ్ బ్యాంకులని సంప్రదిస్తూ.. తమ స్పెర్మ్‌ను భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోందని సమాచారం.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..