లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం..!
lockdown-ap

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మన దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైన్‌ను నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌ స్థానంలో నిలిచిందని జాతీయ మీడియా సర్వే వెల్లడించింది. కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు చేస్తూ.. కరోనా కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ ఎన్డీటీవీ ఓ సర్వే […]

Ravi Kiran

|

Apr 14, 2020 | 9:58 AM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మన దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ చైన్‌ను నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌ స్థానంలో నిలిచిందని జాతీయ మీడియా సర్వే వెల్లడించింది. కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను సక్రమంగా అమలు చేస్తూ.. కరోనా కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ ఎన్డీటీవీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, కేరళ రెండో స్థానం దక్కించుకున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని.. అందువల్లే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడం లేదని తెలిపింది.

కాగా కరోనాను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలన్నీ చేపడుతోంది. రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రిలోనూ ఐసోలేషన్ వార్డు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం జగన్.. కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడానికి సన్నద్ధమయ్యారు. అటు ప్రతీ జిల్లాలోనూ ఇంటింటా సర్వే నిర్వహిస్తూ.. పొడి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. అంతేకాక ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పెట్టి.. ఆయా ప్రదేశాల్లో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ ఎన్డీటీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని, హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ట్వీట్ చేసి రాష్ట్ర ప్రజలు దేనికి భయపడాల్సిన పని లేదని.. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని హామీ ఇచ్చారు.

ఇవి చదవండి:

అక్తర్‌కు అఫ్రిదీ వత్తాసు.. మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

ఇది మన భారతం.. పేదోడి ఆకలి కేకలు.. రోడ్డుపై పారబోసిన పాలకై ప్రయత్నం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu