కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికులకు ‘నెట్‌ఫ్లిక్స్‌’ భారీ విరాళం..!

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించింది. ప్రతి రంగంపై కరోనా తన ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో చాలా రంగాల్లో సేవలు నిలిచిపోయాయి.

కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికులకు 'నెట్‌ఫ్లిక్స్‌' భారీ విరాళం..!
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 3:28 PM

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా స్తంభించింది. ప్రతి రంగంపై కరోనా తన ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో చాలా రంగాల్లో సేవలు నిలిచిపోయాయి. ఇక సినీ పరిశ్రమపై కూడా కరోనా ఎఫెక్ట్ అధికంగా పడింది. ఈ వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోన్న నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక పడగా.. సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో సినీ కార్మికులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రోజు వారి వేతనం పొందే కార్మికులు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో వారి కోసం 100మిలియన్‌ డాలర్ల సహాయ నిధిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రఖ్యాత నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ప్రకటించింది.

సినిమా, టీవీ రంగాలు బాగున్న సమయంలో కార్మికులు నెట్‌ఫ్లిక్స్‌కు మద్దతుగా నిలిచారు. ఈ కష్ట సమయాల్లో వారిని సహాయం చేయాలనుకుంటున్నాం అని ఆ సంస్త చీఫ్‌ క్రియేటివ్ ఆఫీసర్ టెడ్ సరండోస్‌ తెలిపారు. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతోపాటు పలు చోట్ల సహాయ చర్యల్లో పాలుపంచుకోనున్నామని.. ఈ విషయమై తాము చేపట్టే చర్యలను వచ్చే వారం ప్రకటిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే చిత్రీకరణలు పూర్తిగా ఆపేసిన నిర్మాణ సంస్థలలోని సిబ్బందికి రెండు వారాల వేతనం ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించిన విషయం తెలిసిందే.