చికిత్స కోసం.. 130కి.మీలు భార్యను భర్త ఎలా తీసుకువెళ్లాడంటే..!

భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది. వేరే ప్రదేశంలో ఆమెకు కీమో థెరపీ చేయించాలి. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడే స్తంభించింది.

చికిత్స కోసం.. 130కి.మీలు భార్యను భర్త ఎలా తీసుకువెళ్లాడంటే..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 11:55 AM

భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది. వేరే ప్రదేశంలో ఆమెకు కీమో థెరపీ చేయించాలి. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడే స్తంభించింది. పోనీ ప్రైవేట్ అంబులెన్సును మాట్లాడుకుందామా అంటే చెల్లించేంత స్తోమత లేదు. అయితే ఎలాగైనా తన భార్యకు చికిత్స చేయించాలనుకున్నాడు. దీంతో 65 ఏళ్ల వయసులో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి భార్యను సైకిల్‌పై తీసుకెళ్లాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన అరివలగన్‌ (65) అనే రైతు భార్య క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు జిప్మర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ ఆమెకు కీమో థెరపీ అందించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ అమలుతో బస్సులు తిరగడం లేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామునే ఇంటి నుంచి సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని పుదుచ్చేరిలోని జిప్మర్‌కు బయలుదేరాడు. ఒక పగలు, ఒక రాత్రి సైకిల్‌ మీద పయనం సాగించిన ఈ జంట.. బుధవారం ఉదయానికి పుదుచ్చేరికి చేరుకున్నారు. వైద్య నివేదికలు దగ్గర ఉంచుకోవడంతో.. దారిలో పోలీసుల నుంచి వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. సైకిల్‌పై తన భార్యతో వచ్చిన అరివలగన్‌ను చూసి జిప్మర్‌ వైద్యులు ఆశ్చర్యపోయారు. అరివలగన్ భార్యకు వైద్య పరీక్షలు జరిపి, కీమో థెరపీ అందించారు. భార్యపై అరివలగన్‌కు ఉన్న ప్రేమను చూసి చలించిన జిప్మర్‌ వైద్యులు గురువారం సాయంత్రం అంబులెన్స్‌లో ఆ జంటను కుంభకోణంకు పంపించారు.

Read This Story Also: రష్మికపై ఆ నటుడికి సీక్రెట్ క్రష్‌.. గీత మేడమ్ ఏమందంటే..!