లాక్‌డౌన్‌ బేఖాతర్ చేస్తే.. ఈ శిక్షలు తప్పవు.. కేంద్రం అల్టిమేటం..

లాక్‌డౌన్‌ బేఖాతర్ చేస్తే.. ఈ శిక్షలు తప్పవు.. కేంద్రం అల్టిమేటం..

Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుంటేనే రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల అధికారుల ఆదేశాలను ప్రజలు బేఖాతర్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం విపత్తు నిర్వహణ చట్టం 2005ను అమలులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్లు, శిక్షల గురించి తెలుసుకుందాం. సెక్షన్ […]

Ravi Kiran

|

Apr 13, 2020 | 3:58 PM

Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుంటేనే రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల అధికారుల ఆదేశాలను ప్రజలు బేఖాతర్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం విపత్తు నిర్వహణ చట్టం 2005ను అమలులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్లు, శిక్షల గురించి తెలుసుకుందాం.

సెక్షన్ 51: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమిస్తే.. ఈ సెక్షన్ కింద ఏడాది జైలు, జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి. అటు నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 52: ఉద్దేశపూర్వకంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. వారి నుంచి సాయం పొందినట్లయితే.. సదరు వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

అలాగే సెక్షన్ 53 ప్రకారం, విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులను లేదా నగదును దుర్వినియోగం చేసిన వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు. అటు సెక్షన్ 54 కింద ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే.. అలాంటి వారికి గరిష్టంగా రెండేళ్లు, జరిమానా విధించవచ్చు. సెక్షన్ 55 ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి విపత్తు చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశిస్తారు. ఒకవేళ తనకు తెలియకుండా తప్పు జరిగినట్లు ఆధారాలు చూపిస్తే విచారణ నుంచి మినహాయింపు లభిస్తుంది.

ఇక సెక్షన్ 56ను విధి నిర్వహణలో విఫలమైనా, లేదా అనుమతి లేకుండా విధుల నుంచి తప్పుకున్న వారిపై ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. వారికి గరిష్టంగా ఏడాది జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. అటు సెక్షన్ 57, 58లను విపత్తు చట్టంలోని నిబంధనలను ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపణ అయితే కంపెనీ డైరెక్టర్‌, మేనేజర్‌, సిబ్బందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. సెక్షన్‌ 59ను సెక్షన్‌ 55, 56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు. చివరిగా సెక్షన్‌ 60 ద్వారా కోర్టులు విపత్తు చట్టం పరిధిలోని అంశాల్లో కలగజేసుకునే అవకాశం ఉండదు. కాగా, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే నిబంధనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్రం చెబుతోంది.

ఇది చదవండి: Breaking: రేపు ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu