కలకలం రేపిన విందు.. క్వారంటైన్‌లో 26వేల మంది

మధ్యప్రదేశ్‌లో ఓ విందు కలకలం రేపింది. ఓ వ్యక్తి ఇచ్చిన విందులో పాల్గొన్న 10 మందికి కరోనా సోకింది. దీంతో వారు సన్నిహితంగా మెలిగిన 26వేల మందిని అధికారులు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచారు.

కలకలం రేపిన విందు.. క్వారంటైన్‌లో 26వేల మంది
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 06, 2020 | 7:01 AM

మధ్యప్రదేశ్‌లో ఓ విందు కలకలం రేపింది. ఓ వ్యక్తి ఇచ్చిన విందులో పాల్గొన్న 10 మందికి కరోనా సోకింది. దీంతో వారు సన్నిహితంగా మెలిగిన 26వేల మందిని అధికారులు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచారు.

వివరాల్లోకి వెళ్తే.. మురేనాకు చెందిన ఓ వ్యక్తి దుబాయిలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండగా.. తల్లి చనిపోవడంతో గత నెల 17న అతడు స్వస్థలానికి వచ్చాడు. ఆమె మృతికి సంతాపంగా సంప్రదాయం ప్రకారం విందును ఏర్పాటు చేశాడు. దానికి దాదాపు 1,200 మంది హాజరయ్యారు. ఇదిలా ఉంటే మార్చి 27న ఆ వ్యక్తితో పాటు అతడి భార్య అస్వస్థత కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో.. అతడి వివరాలను ఆరా తీశారు. దీంతో ఆ వ్యక్తి దుబాయి ప్రయాణ వివరాలు బయటపడ్డాయి. దంపతులిద్దరికీ ఈ నెల 2న కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఆ వ్యక్తి ఇచ్చిన విందులో పాల్తొన్న మరో 10 మందికి కూడా వైరస్‌ సోకినట్లు ఈ నెల 3న నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. విందుకు హాజరైన వారితో పాటు కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26వేల మందిని క్వారంటైన్‌కు పరిమితం చేశారు.

Read This Story Also: పవన్-రవితేజ మల్టీస్టారర్‌.. స్క్రిప్ట్ రెడీ చేసిన దర్శకుడు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu