డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

డిగ్రీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
Follow us

|

Updated on: Apr 23, 2020 | 8:34 AM

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రమంతా లాక్ డౌన్‌ను మే 7 వరకు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. అత్యవసర పనులకు తప్పితే ప్రజలు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని చెబుతూ కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే కరోనా ప్రభావంతో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విధ్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం కూడా తీసుకుంది.

మరోవైపు లాక్ డౌన్ కారణంగా 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి డిగ్రీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గి.. సాధారణ పరిస్థితులు వచ్చిన నాలుగు వారాలకు ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా, డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపి రెడ్డి తెలిపారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!