రైళ్లలో కోవిడ్-19 సెంటర్లు… 215 రైల్వే స్టేషన్ల గుర్తింపు

కరోనా రోగులకోసం రైళ్లను ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఇందుకు 215 రైల్వే స్టేషన్లను గుర్తించారు. ఈ స్టేషన్ల ద్వారా ప్రయాణించే రైళ్లలో ఐసోలేషన్ కోచ్ లను ఏర్పాటు చేశారు. వీటిని కోవిడ్-19 సెంటర్లుగా వ్యవహరిస్తారు. మొత్తం 23 రాష్ట్రాలకు ఈ సౌకర్యం లభించనుంది. వీటిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువగా రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్టు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ కోచ్ లు తాత్కాలిక ప్రతిపాదికపైనే ఉంటాయని, […]

రైళ్లలో కోవిడ్-19 సెంటర్లు... 215  రైల్వే స్టేషన్ల గుర్తింపు

కరోనా రోగులకోసం రైళ్లను ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఇందుకు 215 రైల్వే స్టేషన్లను గుర్తించారు. ఈ స్టేషన్ల ద్వారా ప్రయాణించే రైళ్లలో ఐసోలేషన్ కోచ్ లను ఏర్పాటు చేశారు. వీటిని కోవిడ్-19 సెంటర్లుగా వ్యవహరిస్తారు. మొత్తం 23 రాష్ట్రాలకు ఈ సౌకర్యం లభించనుంది. వీటిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువగా రైల్వే స్టేషన్లను ఎంపిక చేసినట్టు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ కోచ్ లు తాత్కాలిక ప్రతిపాదికపైనే ఉంటాయని, కరోనాను ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రయత్నాలకు ఊతంగా వీటిని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రైలు ప్రయాణికుల్లో ఎవరికైనా  కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడితే వెంటనే రైల్వే అధికారులను కాంటాక్ట్ చేయాలనీ, బాధితులకు ఈ కోచ్ లలో అన్ని వైద్య సదుపాయాలూ లభిస్తాయని ఆయన వివరించారు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu