కరోనా వైరస్‌: ఇంగ్లండ్ క్రికెటర్ల భారీ విరాళం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటానికి సెలబ్రిటీలు తమ వంతు ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు(పురుషులు, మహిళలు) భారీ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:07 pm, Sat, 4 April 20
కరోనా వైరస్‌: ఇంగ్లండ్ క్రికెటర్ల భారీ విరాళం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటానికి సెలబ్రిటీలు తమ వంతు ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు(పురుషులు, మహిళలు) భారీ విరాళాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. మూడు నెలల పాటు తమ జీతాల్లో 20శాతాన్ని విరాళంగా ఇచ్చేందుకు స్వచ్చందంగా క్రికెటర్లు ముందుకొచ్చారు. ఇంగ్లాండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు చేసిన ఈ ప్రతిపాదనకు ఆటగాళ్లు ఒప్పుకున్నారు. ఇక పురుష క్రికెటర్లు ఇచ్చే డబ్బు 5లక్షల పౌండ్లతో సమానం. ఇక మహిళా క్రికెటర్లు సైతం తమ జీతాల నుంచి మూడు నెలల పాటు 20శాతాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

ఈ నేపథ్యంలో క్రికెటర్లు మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై ఈసీబీతో చర్చలు కొనసాగిస్తున్నాం. ఇక్కడ క్రికెట్ కార్యకలాపాలతో పాటు బయట పరిస్థితులు మెరుగయ్యేందుకు అవసరమైన విధంగా సమిష్టిగా సహకరిస్తాం అని తెలిపారు. కాగా భారత్‌లోనూ పలువురు క్రికెటర్లు కరోనా కోసం విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: పవన్ సరసన తొలిసారి ఆ స్టార్ హీరోయిన్..!