స్విగ్గీ డెలీవరీ బాయ్‌కి కరోనా.. కంపెనీ రియాక్షన్ ఇదే

లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అతను ఎవరికీ ఫుడ్ డెలివరీ చేయలేదని తెలిపింది. అతడు ఎవరెవర్ని కలిశాడన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నామని స్విగ్గీ సంస్థ పేర్కొంది. అలాగే ఇలాంటి సమయంలో బాధితుడికి అండగా..

స్విగ్గీ డెలీవరీ బాయ్‌కి కరోనా.. కంపెనీ రియాక్షన్ ఇదే
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 9:07 PM

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా సోకిందన్న వార్త నగరంలో తీవ్ర కలకలం రేపింది. కాగా అంతకు ముందే ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కి కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ‘పిజ్జాలూ, బిర్యానీలు తినకపోతే చచ్చిపోతామా? ఇంట్లో వేడివేడిగా పప్పనం వండుకొని తింటే బాగుంటుందని’ ప్రజలకు సూచించారు. దీంతో.. ఇవాళ్టి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ స్వీగ్గీ, జొమాటో సేవలపై సీఎం కేసీఆర్ నిషేధం విధించారు. కాగా సీఎం నిర్ణయంపై స్వీగ్గీ యాజమాన్యం స్పందించింది.

ఈ వార్త దురదృష్టకరమని.. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అతను ఎవరికీ ఫుడ్ డెలివరీ చేయలేదని తెలిపింది. అతడు ఎవరెవర్ని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నామని స్విగ్గీ సంస్థ పేర్కొంది. అలాగే ఇలాంటి సమయంలో బాధితుడికి అండగా ఉంటామని తెలిపింది. అంతేకాకుండా కరోనా ప్రభావంతో కస్టమర్లు, డెలివరీ బాయ్స్, రెస్టారెంట్ పార్ట్‌నర్స్ సేఫ్టీపై దృష్టి పెట్టినట్లు స్వీగ్గీ తెలిపింది. డెలివరీకి ముందు.. ఆ తరువాత తప్పకుండా శానిటైజర్ వాడుతున్నారని చెప్పారు. ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రత్యేక టెక్నాలజీ యాప్‌ ద్వారా డెలివరీ బాయ్స్ పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా? మాస్క్ ధరిస్తున్నారా? శానిటైజర్ వాడుతున్నారా లేదా అనేది ఈ యాప్ ద్వారా చెక్ చేస్తున్నామని చెప్పారు. అలాగే డెలివరీ బాయ్స్‌కి కోవిడ్-19 బీమా కూడా అందిస్తున్నామని స్విగ్గీ ప్రతినిధులు తెలిపారు.

అలాగే రెస్టారెంట్స్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తమ పార్ట్‌నర్ రెస్టారెంట్లు ఎలా వండుతున్నారు? సిబ్బంది ఎలా పని చేస్తున్నారు? కిచెన్‌లో పరిశుభ్రత పాటిస్తున్నారా? అని ప్రతీదీ చెకప్ చేసిన తరువాతే ఫుడ్‌ని వినియోగదారులకు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆఖరికి ప్యాకేజీ సమయంలో కూడా శానిటైజర్ వాడుతున్నట్లు వారు తెలిపారు. కాగా కరోనా బారిన పడిన డెలివరీ బాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూల్స్ అన్నింటినీ తూచా.. తప్పకుండా పాటిస్తామని ఈ కష్ట సమయంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తామని స్విగ్గీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా

ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..