లక్షల్లో మిగిలిన శ్రీవారి లడ్డూలు.. ఏం చేశారంటే..!

కరోనా ఎఫెక్ట్‌ తిరుమల శ్రీవారి లడ్డూలపైనా పడింది. భక్తుల దర్శనం రద్దుతో లడ్డూల అమ్మకం నిలిచిపోయింది. ఈ క్రమంలో దాదాపు 2లక్షల లడ్డూలు కౌంటర్లలోనే మిగిలిపోయాయి.

లక్షల్లో మిగిలిన శ్రీవారి లడ్డూలు.. ఏం చేశారంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 12:17 PM

కరోనా ఎఫెక్ట్‌ తిరుమల శ్రీవారి లడ్డూలపైనా పడింది. భక్తుల దర్శనం రద్దుతో లడ్డూల అమ్మకం నిలిచిపోయింది. ఈ క్రమంలో దాదాపు 2లక్షల లడ్డూలు కౌంటర్లలోనే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన లడ్డూలను టీటీడీ పరిపాలన భవనం, స్విమ్స్‌కు తరలించారు. వీటిని టీటీడీ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచితంగా ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి పది లడ్డూల చొప్పున అధికారులు అందజేశారు. మరోవైపు కరోనా నేపథ్యంలో భక్తుల రాకపోకలపై నిషేధం విధించింది టీటీడీ. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడటంతో.. భక్తుల రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నామని.. స్వామివారికి పూజలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు, నివేదనలు యథావిధిగా ఏకాంతంగా ఆగమోక్తంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.  ఈ క్రమంలో వారం రోజుల పాటు తిరుమలను శుభ్రం చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇందులో దాదాపు 300మంది టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొనబోతున్నారు.

Read This Story Also: పారాసిటమాల్ వాడానన్న హాలీవుడ్ నటి..!