కరోనా ప్రపంచ అప్డేట్.. గడిచిన 24 గంటల్లో 5,81,609 పాజిటివ్ కేసులు, 8,922 మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే ఈసారి..

  • Publish Date - 11:07 am, Sun, 22 November 20
కరోనా ప్రపంచ అప్డేట్.. గడిచిన 24 గంటల్లో 5,81,609 పాజిటివ్ కేసులు, 8,922 మరణాలు..

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 5,81,609 పాజిటివ్ కేసులు, 8,922 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,494,801కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,386,570 మంది కరోనాతో మరణించారు. ఇక 40,467,952 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 12,450,666కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 261,790 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 9,095,908 కేసులు నమోదు కాగా.. 133,263 మంది వైరస్ కారణంగా మరణించారు. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!