హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

మొన్న 'కరోనా హెల్మెట్లు, స్వీట్లు', నిన్న 'కరోనా జ్యువెలరీ'.. నేడు 'కరోనా కారు'. అదేంటి కరోనా కార్ అని ఆశ్చర్యపోతున్నారా? అవును హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంది కూడా. ఒక రేంజ్‌లో విజృంభిస్తోన్న కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కఠిన చర్యలు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2020 | 4:59 PM

మొన్న ‘కరోనా హెల్మెట్లు, స్వీట్లు’, నిన్న ‘కరోనా జ్యువెలరీ’.. నేడు ‘కరోనా కారు’. అదేంటి కరోనా కార్ అని ఆశ్చర్యపోతున్నారా? అవును హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంది కూడా. ఒక రేంజ్‌లో విజృంభిస్తోన్న కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కఠిన చర్యలు అమలు పరుస్తుంది. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా పలువురు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి. కరోనా హెల్మెట్లు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోలీసులు రోడ్లపై ర్యాలీలు కూడా చేశారు. అలాగే చిన్నపాటి శిక్షలు కూడా చేశారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏ పనీ లేకుండా రోడ్లపై తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి వినూత్నం కరోనాపై అవగాహన కల్పించేలా.. తన అభిరుచి మేరకు కరోనా వైరస్ ఆకృతిలో ఓ కారును తయారు చేసి రోడ్లపై తిప్పుతున్నారు. కరోనా వైరస్ ఆకారంలో ఓ పెద్ద గుండ్రని వస్తువు రోడ్లపై తిరుగుతుండటం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లోని సుధా కార్జ్ మ్యూజియం వ్యవస్థాపకుడైన సుధాకర్ అనే వ్యక్తి ఈ కారును తయారు చేసి రోడ్లపై తిప్పారు.

కేవలం పది రోజుల్లోనే ఈ కరోనా కారును తయారు చేసినట్లు సుధాకర్ వెల్లడించాడు. అలాగే ఈ కారులో ఒకరు కూర్చొని ప్రయాణించవచ్చు. 100 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో, లీటర్‌కు 40 కిలో మీటర్లు ప్రయాణించగలదని సుధాకర్ తెలిపారు. అంతేకాక.. దీని ద్వారా యువతలో అవగాహన కల్పించవచ్చని సుధాకర్ చెప్పారు. అలాగే.. ఆయనకి కార్ల మీద ఉన్న మక్కువతో.. పలు రకరకాల కార్లను తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. దాదాపు 14 సంవత్సరాలుగా సుధాకర్ వస్తువుల రూపంలో కార్లను తయారు చేస్తున్నారు. బ్యాగ్ కారు, కండోమ్ బైక్, కాఫీ కప్పు కారు, టాయ్‌లెట్ కారు, క్రికెట్ బైక్ వంటి వాటిని తయారు చేశారు.

ఇవి కూడా చదవండి: 

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి..

హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన వైసీపీ ఎమ్మెల్యే

రెహమాన్‌కు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మృతి

‘పాలు’ తాగాడని కన్న కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కరోనా ‘మెడికల్ జ్యువెలరీ’.. వైరస్‌తో వ్యాపారమంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu