వాలంటీర్లు, ఆశా వర్కర్లకు జగన్ గుడ్‌న్యూస్.. ఆ లిస్ట్‌లో వారికి స్థానం..!

కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి బీమా సౌకర్యం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:24 pm, Sun, 19 April 20
వాలంటీర్లు, ఆశా వర్కర్లకు జగన్ గుడ్‌న్యూస్.. ఆ లిస్ట్‌లో వారికి స్థానం..!

కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందికి బీమా సౌకర్యం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నివారణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన జగన్.. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో కరోనా బీమా పరిధిలోకి ఫ్రంట్‌లైన్‌లో ఉన్న వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. ప్రతి రెండు, మూడు రోజులకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆ తరువాత కరోనా పరీక్షలపై సీఎం ఆరా తీశారు. వాటికి సంబంధించిన వివరాలను చెప్పిన అధికారులు.. జనభా ప్రాతిపదికన ప్రతి 10లక్షల మందికి నిర్వహిస్తోన్న జాబితాలో రాష్ట్రం రెండో స్థానానికి చేరినట్లు సీఎంకు తెలిపారు. ర్యాపిడ్ కిట్లు వినియోగించకుండానే ఈ స్థాయికి చేరినట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో సీఎం నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read This Story Also: ‘లాక్‌డౌన్’ వేళ పుట్టిన ఈ బుడ్డోడి పేరు తెలుసా..!