కరోనా వైరస్: వారికి ఏపీ ప్రభుత్వం కీలక హెచ్చరిక..!

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ ఇంకా అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్: వారికి ఏపీ ప్రభుత్వం కీలక హెచ్చరిక..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2020 | 2:54 PM

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ ఇంకా అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎంపీ డాక్టర్లకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో వచ్చే వారికి ఆర్‌ఎంపీ డాక్టర్లు వైద్యం చేయొద్దని స్పష్టం చేసింది. ఆర్‌ఎంపీ డాక్టర్లు కోవిడ్‌-19కు వైద్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రాగా ఈ నిర్ణయం తీసుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, సమీపంలోని ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారం ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలకు ఓ కోవిడ్ ఆసుపత్రికి ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read This Story Also: రెహమాన్ బాధ.. సంగీత దర్శకులు ఇప్పటికైనా మారుతారా..!