శ్రీశైలంలో పెరుగుతున్న కరోనా కేసులు

శ్రీశైల క్షేత్రంలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజులుగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వందకు పైగా చేరడంతో దేవస్థానం అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రంగానే వైద్య సదుపాయాలు కలిగిన శ్రీశైలం నల్లమల ఆటవీ ప్రాంతంలో అత్యవసర చికిత్స కోసం వందల కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మహమ్మారితో బాదపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. అన్నివిధాల జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ఎటువంటి కొవిడ్- 19 […]

శ్రీశైలంలో పెరుగుతున్న కరోనా కేసులు

శ్రీశైల క్షేత్రంలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నెల రోజులుగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వందకు పైగా చేరడంతో దేవస్థానం అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రంగానే వైద్య సదుపాయాలు కలిగిన శ్రీశైలం నల్లమల ఆటవీ ప్రాంతంలో అత్యవసర చికిత్స కోసం వందల కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మహమ్మారితో బాదపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నది.

అన్నివిధాల జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ఎటువంటి కొవిడ్- 19 లక్షణాలు కనిపించకుండానే కరోనా పాజిటివ్ రావడంపై అర్చకులు, అధికారులతో పాటు స్థానికులు కలవర పడుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే స్వామి వారి దర్శనం కోసం భక్తులను అనుమతించడం లేదు.

అయినప్పటికీ చాలా మంది నిత్యం శ్రీశైలం మళ్లికార్జున స్వామి వారి దర్శనం వస్తున్నారు. దర్శనం చేసుకోకుండానే  తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించే వరకు భక్తులు శ్రీశైలం రావొద్దని తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu