ఏపీలో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఒక్క రోజులో 425 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ టెర్రర్‌ సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నుంచి కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఏపీలో 425 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ...

ఏపీలో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఒక్క రోజులో 425 కేసులు
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 18, 2020 | 1:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ టెర్రర్‌ సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నుంచి కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఏపీలో 425 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5854కి చేరింది. ఇక కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే. దీంతో మృతుల సంఖ్య 92 అయింది. అలాగే 2983 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2779గా ఉంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులను నిర్వహిస్తోంది.

ఇక దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 12,881 మందికి కోవిడ్-19 సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. కొత్త‌గా 334 మంది వైర‌స్ బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 12,237కు చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,60,384గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న‌వారు 1,94,325 మంది ఉన్నారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్ర‌భుత్వాల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. దేశంలో గడచిన 24 గంటల్లో 1,65,412 శాంపిల్స్ టెస్టు చేశామ‌ని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. జూన్​ 17 వరకు 62,49,668 టెస్టులు చేసినట్లు తెలిపింది.

Read More: నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి ఫిక్స్ అయిందా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu