మోదీ సర్కార్‌పై కేసీఆర్ ఫైర్.. ‘బోగస్ ప్యాకేజ్’ అంటూ…

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి మోసం అంటూ విమర్శించారు. ఎవరికీ ఉపయోగం లేని బోగస్ ప్యాకేజ్ అని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మంచిదికాదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేంద్ర ప్యాకేజీపై  పలు అంతర్జాతీయ జర్నల్స్ సెటైర్ వేశాయన్నారు. ఏషియన్ ఇన్‌సైట్స్ అనే సింగపూర్ జర్నల్ కామెంట్ చేసిందన్నారు. జపాన్ నుంచి వెలువడే మరో జర్నల్ కూడా ఇండియా స్ట్రాటెజీ […]

  • Ravi Kiran
  • Publish Date - 9:04 pm, Mon, 18 May 20
మోదీ సర్కార్‌పై కేసీఆర్ ఫైర్.. 'బోగస్ ప్యాకేజ్' అంటూ...

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి మోసం అంటూ విమర్శించారు. ఎవరికీ ఉపయోగం లేని బోగస్ ప్యాకేజ్ అని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మంచిదికాదని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా కేంద్ర ప్యాకేజీపై  పలు అంతర్జాతీయ జర్నల్స్ సెటైర్ వేశాయన్నారు. ఏషియన్ ఇన్‌సైట్స్ అనే సింగపూర్ జర్నల్ కామెంట్ చేసిందన్నారు. జపాన్ నుంచి వెలువడే మరో జర్నల్ కూడా ఇండియా స్ట్రాటెజీ అని కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సెటైర్ వేసిందన్నారు. కేంద్రం ఫ్యూడల్ విధానంలో ఉందని.. రాష్ట్రాలు కోరుకుంది ఇది కాదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాలకు నగదు రావాల్సి ఉండగా.. బిక్షగాళ్ళుగా భావించి.. రెండు శాతం ఎఫ్పార్బీఎం పెంచడం హాస్యాస్పదమని అన్నారు. కేంద్రం విధించిన షరతులు వింటే నవ్వుతారని.. దరిద్రపుగొట్టు ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. అటు వన్ నేషన్.. వన్ రేషన్ లో తెలంగాణ నెంబర్ వన్ లో ఉందన్నారు. కేంద్రం అంకెల గారడీ చేసే ప్రజలను మోసం చేస్తోందన్నారు. అటు కరోనా సమయంలో కేంద్రం సాయం చేసేందుకు కండీషన్స్ పెట్టడం కరెక్టు కాదని సీఎం కేసిఆర్ వెల్లడించారు.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..