కరోనా ‘బయో వార్’ నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా..

మొట్టమొదటిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహన్ నగరం శుక్రవారం మరణాల సంఖ్యను 50 శాతం పెంచడంతో డ్రాగన్ కంట్రీ పారదర్శకతపై ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా వ్యవహరించే ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వుహన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైతే.. ఈ విషయాన్ని జనవరి వరకు ప్రపంచానికి తెలియనివ్వకుండా చైనా దాచిపెట్టింది. అంతేకాకుండా అన్ని దేశాలపై చైనా బయో వార్ ప్రకటించడంలో […]

కరోనా 'బయో వార్' నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా..
Follow us

|

Updated on: Apr 17, 2020 | 5:18 PM

మొట్టమొదటిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహన్ నగరం శుక్రవారం మరణాల సంఖ్యను 50 శాతం పెంచడంతో డ్రాగన్ కంట్రీ పారదర్శకతపై ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా వ్యవహరించే ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వుహన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైతే.. ఈ విషయాన్ని జనవరి వరకు ప్రపంచానికి తెలియనివ్వకుండా చైనా దాచిపెట్టింది.

అంతేకాకుండా అన్ని దేశాలపై చైనా బయో వార్ ప్రకటించడంలో భాగంగానే ఈ వైరస్‌ను సృష్టించిందంటూ ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వుహన్ స్థానిక ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన గణాంకాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తమ దేశంలో కరోనా వైరస్‌తో మొత్తం 4,632 మంది మృత్యువాతపడినట్టు ప్రకటించింది. అంతేకాక వుహన్‌లో మరో 1,290 మంది కరోనా వైరస్‌తో చనిపోయినట్లు నిర్ధారించింది. ప్రైవేట్, తాత్కాలిక ఆసుపత్రుల్లో నుంచి సమాచారం సేకరించడంలో జాప్యం జరిగిందని.. గతంలో ఆసుపత్రులకు రాకుండా ఇంట్లోనే చనిపోయిన వారిని అప్పట్లో లెక్కించలేకపోయమని తెలిపింది.

కాగా, గురువారం నాటికి చైనాలోని వుహన్‌లో మరణాల సంఖ్య 2,579గా ఉంది. దీన్ని ఒక్కసారిగా 3,869కి సవరించారు. అంటే సుమారుగా 50 శాతం డెత్ రేట్ పెరిగింది. దీనితో దేశవ్యాప్త మరణాల సంఖ్య మరో 6 శాతం పెరిగి 4,636కు చేరింది. అలాగే వుహన్‌లో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్యలో సైతం మరో 325 కొత్త కేసులను కలిపింది. ఇదంతా చూస్తుంటే చైనాపై అనుమానం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..

‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ