Covid Third Wave: కేంద్రం కీలక నిర్ణయం.. యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు..

Covid Rapid Antigen Test Kits: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సమస్య ఇప్పుడే

Covid Third Wave: కేంద్రం కీలక నిర్ణయం.. యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు..
Rapid Antigen Test Kits
Follow us

|

Updated on: Aug 17, 2021 | 12:23 PM

Covid Rapid Antigen Test Kits: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సమస్య ఇప్పుడే ముగిసిపోలేదని.. థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సైతం కొంతమేర కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నిర్ధారించేందుకు ఉపయోగిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఎగుమతి విధానాలను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

కోవిడ్‌-19 యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టంచేసింది. వీటిని తక్షణమే ఆంక్షల కేటగిరీలో చేర్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటిజెన్‌ కిట్లనే ఎక్కువగా కొవిడ్‌ పరీక్షల కోసం వినియోగిస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షా ఫలితాల కంటే.. వేగంగా ఫలితాలు వస్తుండటంతో అందరూ యాంటిజెన్‌ కిట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల కోసం ప్రయోగశాలలు అందుబాటులో లేకపోవడంతో.. యాంటిజెన్‌ కిట్లు కీలకంగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్‌ల లభ్యతను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కిట్ల ఎగుమతిని ఆంక్షల జాబితాలో చేర్చింది. ఆంక్షల కేటగిరిలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

కాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం 25,166 కేసులు నమోదు కాగా.. 437 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3,69,846 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 97.51 శాతంగా రికవరీ రేటు ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679 కి చేరగా.. మరణాల సంఖ్య 4,32,079 కి పెరిగింది.

Also Read:

Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. వాహనాల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..

ఇది సినిమా షూటింగ్‌ కాదు…బోట్‌ రేసింగ్‌ అంతకంటే కాదు….నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య బిగ్ ఫైట్.. ఎందుకంటే?

భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.