వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇవ్వాలి..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న వలస కార్మికులు ఒక్కొక్కరికీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇవ్వాలి..
Follow us

|

Updated on: Jun 03, 2020 | 9:06 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న వలస కార్మికులు ఒక్కొక్కరికీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కరోనా కాలంలో వలస కార్మికులే ఎక్కువగా నష్టపోయారు. వారి ఖాతాల్లోకి కేంద్రం రూ. 10 వేలు జమ చేయాలని ఆమె అన్నారు.

‘ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది ప్రజలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు మెరుగుపడడానికి కేంద్రం తక్షణమే రూ. 10 వేలు వారి ఖాతాల్లోకి జమ చేయాలి. అది కూడా పీఎం కేర్స్ నుంచి ఉపయోగిస్తే బాగుటుందని’ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.