కరోనా రోగులకు వరం ‘కొరొనిల్’ ఆయుర్వేద ఔషధం.. బాబా రాందేవ్

దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అణచివేసేందుకు తాము విశిష్టమైన ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నామని ప్రకటించారు బాబా రాందేవ్. 'కొరొనిల్' గా ఈ మందును వ్యవహరిస్తున్నామని అన్నారు.  పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణతో..

కరోనా రోగులకు వరం 'కొరొనిల్' ఆయుర్వేద ఔషధం.. బాబా రాందేవ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 1:17 PM

దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అణచివేసేందుకు తాము విశిష్టమైన ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నామని ప్రకటించారు బాబా రాందేవ్. ‘కొరొనిల్’ గా ఈ మందును వ్యవహరిస్తున్నామని అన్నారు.  పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణతో కలిసి ఆయన  దీన్ని మంగళవారం హరిద్వార్ లో లాంచ్ చేశారు. అశ్వగంధ, తులసి, గిలాయ్, శ్వాసరీ రస్, అణు తేల్ మిశ్రమాలతో ఈ మందును తయారు చేశామని, దీన్ని రోజులో రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తీసుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ మందులో అశ్వగంధ కారణంగా కరోనా రోగి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తులసి మూలిక.. రోగి బాడీలోని వైరస్ కారకాలను నిర్మూలిస్తుందని ఆయన వివరించారు. శ్వాసరీ రస్ కారణంగా రోగి సజావుగా శ్వాస తీసుకోగలుతాడని చెప్పారు. కొరొనిల్ మందు సేవించిన రోగి 5 రోజుల నుంచి 14 రోజుల్లోగా పూర్తిగా కోలుకోగలుగుతాడని పేర్కొన్నారు. ఇది కరోనా వైరస్ ని నియంత్రించగల తొలి ఆయుర్వేద ఔషధం..దీన్ని క్లినికల్ గా రోగులపై పరీక్షించినప్పుడు మూడు రోజుల్లోనే 69 శాతం, ఏడు రోజుల్లో 100 శాతం నెగెటివ్ వచ్చింది అని బాబా రాందేవ్ తెలిపారు. తమ ఔషధానికి అన్ని మందుల తయారీ సంస్థలు అనుమతిని మంజూరు చేశాయన్నారు. మొత్తం 280 మంది రోగులపై ఈ ఔషధాన్ని పరీక్షించినట్టు ఆయన చెప్పారు. దీన్ని హరిద్వార్ లోని దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ సంస్థల్లో తయారు చేశామని, అలాగే పతంజలి రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ తో బాటు జైపూర్ లోని నేషనల్ ఇండస్ట్రీస్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మిశ్రమాన్ని కలిపామని తెలిపారు. ఎంతో కాలంగా కరోనా వైరస్ ని నియంత్రించగల మందుల కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్న తరుణంలో.. ఇది మొట్టమొదటి ఆయుర్వేద ఔషధం అని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..