అంతా ఆయుధంగా భావిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికీ దీనిక వ్యాక్సిన్ రెడీ కాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.అయితే దీనిని అరికట్టే విషయంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌నే పెద్ద ఆయుధంగా భావిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మనదేశం కూడా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ అనేది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర […]

అంతా ఆయుధంగా భావిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 4:20 PM

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికీ దీనిక వ్యాక్సిన్ రెడీ కాకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.అయితే దీనిని అరికట్టే విషయంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌నే పెద్ద ఆయుధంగా భావిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మనదేశం కూడా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ అనేది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను.. రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడమేంటని ప్రశ్నించారు.

ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఓవైసీ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడమనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ.. వారి వారి రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ఇక క్వారంటైన్ అనేది మన మంచికేనన్న ఓవైసీ.. కరోనా ఎవరికైనా రావచ్చని.. దానికి భయపడకుండా.. ఎవరికి వారే 8-10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండటమన్నది బెటర్ అని పేర్కొన్నారు.