AP Vaccination : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఎపి కొత్త రికార్డు, జాతీయ స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన ఘనత

కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రికార్డును తనకు తానే తిరగరాసింది.

AP Vaccination : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఎపి కొత్త రికార్డు,  జాతీయ స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన ఘనత
Covid Vaccine
Follow us

|

Updated on: Jun 20, 2021 | 11:45 PM

Covid vaccination : కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రికార్డును తనకు తానే తిరగరాసింది. ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌ గా నిర్వహించారు. ఫలితంగా కొవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి వ్యాక్సినేషన్‌లో తన సామర్థ్యంను చాటుకున్నట్లైంది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలన్న సీఎం ఆదేశాలను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాబై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు లక్షలాధి మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యంను ఎపి సొంతం చేసుకుంది. గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించి వైద్య, ఆరోగ్యరంగంలో తమ సంసిద్దతతను పరీక్షించుకుంది. నేడు దానిని కూడా అధిగమించి దాదాపు పదమూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది జగన్ సర్కారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి జిల్లాలకు వ్యాక్సిన్‌ అత్యంత తక్కువ సమయంలోనే రవాణా అయింది. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ను గన్నవనం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్‌కు తరలించడం, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా వారికి కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గన్నవరం సెంటర్‌ నుంచి ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ చేరుకున్న వెంటనే, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వాటిని పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ సేపు కూడా వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ప్రణాళికాబద్దంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. ఏ కేంద్రంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారో ముందుస్తుగానే వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియచేస్తుండటంతో, ప్రజలకు చేరువగానే ఏర్పాటు చేసే శిబిరాల్లో వ్యాక్సిన్ అందించడం ప్రారంభిస్తున్నారు.

Read also : TSRTC : తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్..! రేపట్నుంచి రెండు రాష్ట్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసులు

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా