మున్సిపల్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.!

మున్సిపల్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.!

కరోనాపై పోరులో పురపాలిక శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. కరోనా నియంత్రణ, సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన పురపాలిక అధికారులు, ఉద్యోగులకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, త్వరలోనే సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు […]

Ravi Kiran

|

May 10, 2020 | 3:01 PM

కరోనాపై పోరులో పురపాలిక శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. కరోనా నియంత్రణ, సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన పురపాలిక అధికారులు, ఉద్యోగులకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, త్వరలోనే సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

సచిన్, ద్రావిడ్‌ల నీడలో సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయింది!

జూన్‌లో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ పడేనా.!

తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu