పోలవరం ప్రాజెక్ట్ పనులపై జగన్ సమీక్ష..

ఒక వైపు కరోనా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ పధకాలు, ప్రాజెక్ట్ పనుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ వేగం పెంచారు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష జరిపిన ఆయన.. సిమెంటు, స్టీల్‌ సరఫరా విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా స్పిల్‌వే పనులు జూన్‌ నెలాఖరు కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. అటు కరోనా కారణంగా నెల రోజులకుపైగా అత్యంత విలువైన సమయం వృధా […]

పోలవరం ప్రాజెక్ట్ పనులపై జగన్ సమీక్ష..
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:30 PM

ఒక వైపు కరోనా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు సంక్షేమ పధకాలు, ప్రాజెక్ట్ పనుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ వేగం పెంచారు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష జరిపిన ఆయన.. సిమెంటు, స్టీల్‌ సరఫరా విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా స్పిల్‌వే పనులు జూన్‌ నెలాఖరు కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. అటు కరోనా కారణంగా నెల రోజులకుపైగా అత్యంత విలువైన సమయం వృధా అయిందన్న అధికారులు.. ఏప్రిల్‌ 20 నుంచి కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయని సీఎంకు తెలిపారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రతి పనికి కూడా సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్న సీఎం.. డిజైన్ల అప్రూవల్స్‌ వీలైనంత త్వరగా తెప్పించాలని ఆదేశించారు.

మరోవైపు గతేడాది గోదావరి వరదలను గుర్తు చేస్తూ.. ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్నికూడా శరవేగంతో తరలించాలి సీఎం సూచించారు. వారికి సంబంధించిన సహాయ పునరావాస కార్యక్రమాలను కూడా శరవేగంగా చేపట్టాలన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్‌–2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా సీఎం సమీక్ష జరిపారు. ఈ ప్రాజెక్టుల పనులన్నీ కూడా నిర్దేశించుకున్న కాలంలోగా పూర్తికావాలని వైఎస్ జగన్ ఆదేశించారు.

Read More: 

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..