AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ వింత పరిస్థితి.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు..!

AP Covid-19 Cases: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మరోసారి కోరలు చాస్తోంది. మెల్లమెల్లగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా కనిపిస్తోంది.

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ వింత పరిస్థితి.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు..!
Corona Third Wave

AP Covid-19 Cases: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మరోసారి కోరలు చాస్తోంది. మెల్లమెల్లగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా కనిపిస్తోంది. ప్రతిరోజు నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు తక్కువ కేసులు నమోదైతే, మరో రోజు కేసుల సంఖ్య పెరుగుతోంది. వారం రోజుల క్రితం వెయ్యికి తగ్గని కేసులు గత కొన్ని రోజులుగా 500 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే, పాజిటివ్ తగ్గుతున్న మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది.

కాగా, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో 40,350 సాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 20,59,122కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. అయితే, గడిచిన 24 గంటల్లో మరో 10మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలను కోల్పోయారని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,286కు చేరింది. కోవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.

అలాగే, కొత్తగా కరోనా నుంచి 557 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 20,38,248మంది కోలుకుని సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,588 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, ఇప్పటి వరకు మొత్తంగా 2,88,79,945 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Read Also..  Kanakadurga Theppotsavam: బెజవాడ దుర్గమ్మ భక్తులకు నిరాశ.. ఈసారి ఆ భాగ్యం దక్కనట్లే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu