AP Health: ఎన్ని వేవ్‌లు వచ్చినా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం : ఏపీ మంత్రి

ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి..

AP Health: ఎన్ని వేవ్‌లు వచ్చినా  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం : ఏపీ మంత్రి
Alla Nani
Follow us

|

Updated on: Jul 18, 2021 | 2:27 PM

Alla Nani: ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాని అన్నారు.

ఇవాళ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్‌ ఐకేర్‌ ఆస్పత్రిలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని నాని ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారని చెప్పిన మంత్రి.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఏ సమస్య అయినా నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు.

Read also: Vizianagaram MP : అశోక్ గజపతిరాజు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయనగరం ఎంపీ