ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,261కు చేరింది. ఇందులో 85,130 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,18,311 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 88 మంది మరణించగా..

ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 5:49 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే రెండు, మూడు రోజలు నుంచి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. కాగా గత 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,261కు చేరింది. ఇందులో 85,130 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,18,311 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 88 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2820కు చేరింది.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 445, చిత్తూరులో 990, తూర్పు గోదావరిలో 1396, గుంటూరులో 895, కడపలో 755, కృష్ణాలో 281, కర్నూలులో 830, నెల్లూరులో 684, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖలో 928, విజయనగరంలో 513, పశ్చిమ గోదావరిలో 805 కేసులు నమోదయ్యాయి.

Also Read:

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు