Smart Phone Tips: మొబైల్ నుంచి కూడా కరోనా ప్రమాదం.. ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా..

Smart Phone Tips: మొబైల్ నుంచి కూడా కరోనా ప్రమాదం.. ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా..
Phone Clean

మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లైతే పెద్దగా సమస్య ఉండక పోవచ్చు. అదే మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారైతే అదనపు జాగ్రత్త అవసరం. మన..

Sanjay Kasula

|

Jan 04, 2022 | 1:01 PM

తగ్గిందిరా బాబోయ్ అనుకునేంతలో మళ్లీ మొదలైంది. గత సెకెండ్ వేవ్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆ మాయదారి వైరస్ గురించి తెలుసుకోవడంతోపాటు దూరంగా ఉండటం.. జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా ఆ వైరస్ మన వైపు రాకుండా జాగ్రత్తపడడం ప్రతి ఒక్కరికీ అవసరమే. మరి ఆ విషయాలు ఏంటో మీరూ తెలుసుకోండి.

కరోనా సెకెండ్ వేవ్ దాటుకుని మనం ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాం. అప్పుడే మరోసారి డేంజర్ బెల్స్ వినిపిస్తున్నాయి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని వైరస్ ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. ఉతికిన వస్త్రాలను ధరిస్తూ మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా వైరస్ ఇతర వైరస్ ల మాదిరిగానే చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లైతే పెద్దగా సమస్య ఉండక పోవచ్చు. అదే మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారైతే అదనపు జాగ్రత్త అవసరం. మన దైనందిన జీవితంలో వాడే ఏ వస్తువులను ఉపయోగించినా తరచుగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ప్రయాణాల్లో ముఖ్యంగా మీ వెంట శానిటైజర్ ను తీసుకువెళ్లడం ఎంతో మంచిది. ఏదైనా తినాలనుకున్నప్పుడు మాత్రం చేతులను కడుక్కున్నాక మాత్రమే తినడం అలవాటు చేసుకొండి. పదే పదే చేతులు కడుక్కోవడం లేదా చేతులను శుభ్రపరచుకోవడం మంచింది. దీనితో పాటు మన ఫోన్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

మనం చాలాస్లారు మనతో ఉండే మొబైల్ ఫోన్‌లను శుభ్రపరచడాన్ని మరిచిపోతుంటాము. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న ఈ తరుణంలో జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది.

టాయిలెట్ సీటు కంటే సెల్ ఫోన్‌పై 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా

చేతులతో పాటు మనం ఎప్పటికప్పుడు ఉపయోగించిన ఫోన్‌లో బ్యాక్టీరియా లేకుండా చూసుకోవడం చాలా అవసరం ఉంది. ఓ నివేదిక ప్రకారం టాయిలెట్ సీటు కంటే సెల్ ఫోన్ 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను మోసుకెళ్లగలదు. అత్యంత ప్రమాదకరంగా మారతున్న కోవిడ్ వైరస్ సంక్రమించకుండా చూసుకోవాలి. సెల్ ఫోన్‌లపై ఉండే వైరస్‌ను అంతం ఎలా చేయాలో మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు, మొబైల్ ఫోన్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం చేతులను ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ ముఖం లేదా నోటికి దగ్గరగా ఉండేది మాత్రం మనం ఉపయోగించే మొబైల్ ఫోన్.

ఇలా శుభ్రం చేయండి..

నేటి సమయంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సెల్ ఫోన్‌లు జెర్మ్స్, బాక్టీరియా బారిన పడేలా మనల్ని మరింత హాని చేస్తాయి. కలుషిత వాతావరణంలో కూడా ఫోన్‌ని తీసుకెళ్లే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది.

మనం మన ఫోన్‌ను ఇతర కారణాల వల్ల మార్చుకుంటు ఉంటాం. దీని కారణంగా ఇతరుల చేతులకు ఇన్‌ఫెక్షన్ ఉంటే.. అది ఫోన్ ద్వారా మీకు చేరుతుంది. అంటే, మీరు మీ ఫోన్‌ను కరోనా సోకిన వ్యక్తికి తప్పుగా ఇచ్చినట్లయితే.. ఆ ఫోన్ ద్వారా కూడా వైరస్ మీకు చేరుతుంది.

అటువంటి పరిస్థితిలో ఎవరికైనా ఫోన్ ఇచ్చిన తర్వాత మీరు మీ ఫోన్‌ను యాంటీ బాక్టీరియల్ వైప్స్‌తో క్రమం తప్పకుండా తుడవాలి. మీరు ఈ కోవిడ్ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్లయితే శానిటైజ్ చేయకుండా ఫోన్‌ను ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు ఎవరైనా ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా శుభ్రం చేయండి. ఫోన్‌ను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించండి. మీరు ఫోన్‌ను శుభ్రం చేయడానికి క్రిమిసంహారక స్ప్రేకి బదులుగా ఆల్కహాల్‌తో శుభ్రముపరచు.  60 శాతం నీరు, 40 శాతం ఆల్కహాల్ ఉండేలా చూసుకోండి.  ఇలా ఓ బాటిల్‌లోనిల్వ చేసుకుని ఆ లిక్విడ్‌ను మెత్తటి గుడ్డపై స్ప్రే చేసి మీ ఫోన్ క్లీన్ చేయండి. ఆ తర్వాతే ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu