Mumbai: ముంబైలో 80 శాతం మందికి కరోనా.. కీలక విషయాలు వెల్లడించిన టీఐఎఫ్‌ఆర్‌c

TIFR report: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షల వరకు నమోదైన కేసులు.. ఇప్పుడు నలభై వేలు

Mumbai: ముంబైలో 80 శాతం మందికి కరోనా.. కీలక విషయాలు వెల్లడించిన టీఐఎఫ్‌ఆర్‌c
80% of Mumbai already exposed to coronavirus
Follow us

|

Updated on: Jun 30, 2021 | 7:19 AM

TIFR report: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నిత్యం నాలుగు లక్షల వరకు నమోదైన కేసులు.. ఇప్పుడు నలభై వేలు నమోదవుతున్నాయి. కరోనా ప్రారంభం నాటినుంచి మహారాష్ట్రలో కరోనా విలయతాండం సృష్టించింది. కేసుల పరంగా మరణాల పరంగా దేశంలో మొదటి స్థానంలో నిలించింది. అయితే.. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా హాట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కఠిన నిబంధనల అనంతరం అక్కడ కూడా కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే.. ముంబైలో ఇప్పటికే 80 శాతం ప్రజలు కరోనా బారినపడి ఉండవచ్చని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కారణంగా థర్డ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే, థర్డ్‌ వేవ్‌లో రీ ఇన్ఫెక్షన్లది కీలక పాత్ర కానుందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) స్పష్టం చేసింది.

ఇప్పటివరకు రెండోసారి కరోనా (రీ ఇన్ఫెక్షన్లు) సోకినవారు తక్కువగా ఉండటమే దీనికి కారణమంటూ విశ్లేషించింది. ఈ మేరకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) అధ్యయనం విషయాలను మంగళవారం వెల్లడించింది. కోవిడ్‌ సోకని మిగతా 20% మందికి త్వరగా టీకా ఇవ్వడంతో పాటు రీ ఇన్ఫెక్షన్లపై దృష్టిపెట్టడం ద్వారా థర్డ్‌ వేవ్‌‌ తీవ్రతను ముందే పసిగట్టొచ్చని.. ఆ తర్వాత చర్యలు, ప్రణాళికతో ముందుకు వెళ్లవచ్చని టీఐఎఫ్‌ఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ డీన్‌ డాక్టర్‌ సందీప్‌ జునేజా తెలిపారు. అయితే.. కరోనా రీ ఇన్ఫెక్షన్ల తీవ్రత ప్రకారం థర్డ్ వేవ్‌ను అంచనా వేయవచ్చిని పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో ఢిల్లీ, బెంగళూరు కంటే అత్యధిక కేసులు ముంబైలోనే నమోదయ్యాయని తెలిపారు. దీని ప్రకారం చూస్తే థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉంకపోవచ్చని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. దేశంలో 102 రోజుల తర్వాత కరోనా కేసులు 40 వేల దిగువన నమోదయ్యాయి. సోమవారం 37,566 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. 907 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Child Marriage: తండాలో బాల్య వివాహం.. పోలీసుల కళ్లుగప్పి వధూవరుల జంప్.. చివర్లో దిమ్మ తిరిగే ట్విస్ట్

జమ్మూ ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి.. ఐరాసలో భారత్ ఆందోళన.. నివారించాలని అభ్యర్థన

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??