వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 3.41 లక్షలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5,358,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 341,638 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 2,184,004 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 3.41 లక్షలు..
Follow us

|

Updated on: May 23, 2020 | 9:55 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5,358,488 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 341,638 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 2,184,004 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉద్దృత్తి తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(1,650,677), మరణాలు(97,800) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 339,687 నమోదు కాగా, మృతుల సంఖ్య 21,579కు చేరింది. ఇక  రష్యాలో 335,882 పాజిటివ్ కేసులు,  3,388 మరణాలు నమోదయ్యాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 130,506 నమోదు కాగా, మృతుల సంఖ్య 3,850కి చేరింది.