అక్కడ మాత్రమే గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి: డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టత

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని.. దీన్ని పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలను సవరించాలని ఇటీవల దాదాపు 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

అక్కడ మాత్రమే గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి: డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టత
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 1:17 PM

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తోందని.. దీన్ని పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలను సవరించాలని ఇటీవల దాదాపు 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌ఓ పరిశీలన తరువాత గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఇలా వ్యాపిస్తుందని స్పష్టం చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, ఎక్కువ వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీటితో పాటు వైరస్ సోకిన వ్యక్తులు తిరిగిన ఇండోర్‌ ప్రదేశాల్లోనూ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

కాగా వైరస్ సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు లేదా దగ్గినప్పుడు తుంపరులు గాలిలో ఉండిపోతాయని.. ఇలా మరొకరికి కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వాదించారు. అయితే ఈ వాదనను డబ్య్లూహెచ్‌ఓ గత కొన్ని రోజులుగా తోసిపుచ్చుతూ వచ్చింది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో రోగులను వెంటిలేషన్‌పై ఉంచిన సందర్భాల్లోనే వైరస్ అలా వ్యాపిస్తోందని చెబుతూ వచ్చింది. తాజాగా దాన్ని మరోసారి పునః పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వివరించింది. ఇక అసింప్టమాటిక్‌ వ్యక్తులతో వైరస్ వ్యాప్తి చాలా అరుదు అని డబ్ల్యూహెచ్‌ఓ మరోసారి స్పష్టం చేసింది.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..