కరోనా గుప్పిట్లో మహారాష్ట్ర విలవిల !

కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది.

కరోనా గుప్పిట్లో మహారాష్ట్ర విలవిల !
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 10:43 AM

కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న వైరస్‌ సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో లక్ష కేసులు దాటేశాయి. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైలో నమోదు అయ్యాయి. దీంతో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ముంబైని వణికిస్తున్నాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044కి చేరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో వరసగా 28 రోజులు కొత్త కేసులు నమోదు అవకపోతే ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌ నుంచి మినహాయిస్తారు. ముంబైలో 4,500 భవనాల్లో కరోనా కేసులు బయట పడడంతో అక్కడి నుంచి రాకపోకలు నిలిపివేశారు. బెడ్స్‌ లేక ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్‌ కంటే ప్రమాదకరమైన స్థితిలోకి ముంబై వెళ్లిపోతోంది. వెంటిలేటర్‌ కావాలంటే 2 గంటలు కంటే ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోందని స్వయంగా ఆస్పత్రి వైద్యులే చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు రెండు రోజుల ముందే అంటే మార్చి 23 నుంచే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. అప్పటికి రాష్ట్రంలో 97 కేసులు మాత్రమే ఉండేవి. అయితే మహారాష్ట్ర జనాభా, జనసాంద్రతతో పోల్చి చూస్తే కేసుల్ని బాగా నియంత్రించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే అంటున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి తొలిదశలో లాక్‌డౌన్‌ సాయపడిందని అన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34% ఉంటే, మరణాల రేటు 3.7%గా ఉంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..