గుడ్‌న్యూస్: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ రెడీ..

ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి కరోనావైరస్‌ని అరికట్టేందుకు.. ప్రపంచ శాస్త్రవేత్తలు మొదటినుంచి కృషి చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ తయారైంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లుగా...

గుడ్‌న్యూస్: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ రెడీ..
Follow us

|

Updated on: Mar 04, 2020 | 9:11 AM

ఎక్కడో చైనాలోని వుహన్‌లో పుట్టింది…అక్కడి పట్టణాలు, నగరాలను పట్టి పీడిస్తోంది. అతివేగంగా విస్తరిస్తూ..ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు హరించిన కొవిడ్- 19 వైరస్..తాజాగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించి…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ఈ వ్యాధికి మెడిసిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు మొదటినుంచి తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు అమెరికాలోని ఓ బయోటెక్ సంస్థ ప్రకటించింది.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న…కొవిడ్- 19 వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లుగా అమెరికాకు చెందిన మోడెర్నా బయోటెక్‌ సంస్థ ప్రకటించింది. కరోనాను క్యూర్ చేయగల ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లు సదరు సంస్థ వెల్లడించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ఇన్‌ఫెక్షన్స్‌కు ఎంఆర్‌ఎన్‌ఎ-1273 పేరిట తయారైన ఈ వ్యాక్సిన్‌ను ఆ సంస్థ అందజేసింది. ఏప్రిల్‌ నెలలో మనుష్యులపై ప్రయోగాలు చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. కానీ, ఈ ప్రక్రియ పూర్తయ్యి, అనుమతులు వచ్చే సరికి కనీసం ఏడాది పట్టే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.