ప్రపంచానికే ఇది శుభవార్త..క‌రోనా వ్యాక్సిన్ రెడీః ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్శిటీ

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఓ గుడ్‌న్యూస్‌నందించింది. నిజంగా యావ‌త్ ప్రపంచానికే ఇది శుభవార్త. త‌మ శాస్త్ర‌వేత్త‌లు క‌రోనాకు ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్‌ను సిద్ధం చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. అయితే,...

ప్రపంచానికే ఇది శుభవార్త..క‌రోనా వ్యాక్సిన్ రెడీః ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్శిటీ
Follow us

|

Updated on: Apr 09, 2020 | 2:06 PM

భూప్ర‌పంచం మొత్తాన్ని క‌రోనా క‌బ‌ళిస్తోంది. కోర‌లు చాస్తున్న వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం 208 దేశాల‌కు విస్త‌రించింది. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువులా ప్ర‌జ‌ల‌పై పంజా విసురుతూ..అన్ని ఖండాల‌ను త‌న ఆదీనంలోకి తెచ్చుకుంది. వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. ఐసోలేషన్, సామాజిక దూరంతోనే మహమ్మారిని అడ్డుకోగలమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఓ గుడ్‌న్యూస్‌నందించింది. నిజంగా యావ‌త్ ప్రపంచానికే ఇది శుభవార్త. త‌మ శాస్త్ర‌వేత్త‌లు క‌రోనాకు ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్‌ను సిద్ధం చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. అయితే,…

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ గుడ్‌న్యూస్ చెప్పింది. మరో ఆరు నెలల్లో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు భరోసా ఇచ్చారు. ఇప్పటికే పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చినట్టేనని ప్రకటించారు. ఈ నెల నుంచి సెప్టెంబర్‌ వరకు 500 మంది వాలంటీర్లపై ఈ పరిశోధనలు జరుగుతాయని, ఖ‌చ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకు వచ్చి సంతకాలు చేసినట్టు బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక సలహాదారు వివరించారు.

మొదటగా చైనాకు చెందిన వాలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగం జరిపినట్టు పరిశోధకులు వెల్లడించారు. వారంతా 14 రోజుల ఐసోలేషన్‌ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడినట్టు వివరించారు. మొత్తం 108 మందిపై పరిశోధనలు జరిపామని 18 మంది అబ్టర్వేషన్‌ పూర్తయిందని, వారంతా కరోనా నుంచి బయటపడ్డారని వివరించారు. మరో ఆరు నెలల పాటు వీరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తూ పరిశోధనలు జరుపుతామని, అనంతరం ఖ‌చ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని స్ప‌ష్టం చేశారు.

వ్యాక్సిన్ ఖ‌చ్చితంగా పనిచేస్తోందని నిర్ధారణ అయిన తర్వాత ఇదే వ్యాక్సిన్‌ను పలు దేశాల్లో కూడా పరీక్షిస్తామని చెప్పారు. చైనా మిలిటరీకి చెందిన బయో వార్‌ఫేర్‌ నిపుణురాలు చెన్‌వీ ఇప్పటికే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు పరిశోధనలు జరిపారు. అక్కడ పలు వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించారు. అవి కూడా సక్సెస్‌ అయినట్టు చైనా మీడియా తెలిపింది. వూహాన్‌లో ఐసోలేషన్‌లో వారిని ఉంచి ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇప్పుడు వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసి స్వేచ్ఛను కల్పించిన సంగతి తెలిసిందే.