Coronavirus: కరోనాతో కుట్ర.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్…

Coronavirus Updates: ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) అజెండాలో కాశ్మీర్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రతిపాదించింది. దీన్ని భారత్ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. జమ్మూకాశ్మీర్ అంశం ఎప్పటికీ కూడా భారత్ అంతర్గత వ్యవహారమేనని మరోసారి స్పష్టం చేసింది. ‘ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి జమ్మూకాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని భారత్ తిరస్కరించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘కాశ్మీర్ అంశంపై భారత్ […]

Coronavirus: కరోనాతో కుట్ర.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్...
Follow us

|

Updated on: Apr 12, 2020 | 9:03 AM

Coronavirus Updates: ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) అజెండాలో కాశ్మీర్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రతిపాదించింది. దీన్ని భారత్ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. జమ్మూకాశ్మీర్ అంశం ఎప్పటికీ కూడా భారత్ అంతర్గత వ్యవహారమేనని మరోసారి స్పష్టం చేసింది.

‘ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి జమ్మూకాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని భారత్ తిరస్కరించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరి ఏంటో చైనాకు బాగా తెలుసు. ఇప్పటికీ, ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ ఇండియాలోని అంతర్భాగమే. అంతేకాక ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా భారతదేశానికి అంతర్గతమైనవేనని’ తెలిపింది. కాబట్టి ఇప్పటికైనా చైనాతో సహా ఇతర దేశాలు భారతదేశ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం మానేసి.. జమ్మూకాశ్మీర్‌తో సహా భారత ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సీమాంతర ఉగ్రవాదాన్ని గుర్తించి, ఖండించాలంటూ చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

జమ్మూకాశ్మీర్ అంశంపై ఇప్పటికీ భారత్ పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతోంది. ఇక ఈ విషయంపై మున్ముందు చర్చించడానికి పాక్ భారత్‌పై ఉగ్రవాద చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే పాకిస్తాన్ మాత్రం జమ్మూకాశ్మీర్ అంశం వివాదంలో ఉందని.. అంతేకాకుండా ఇండియాను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాద గ్రూపులకు తాము ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెబుతోంది. అటు చైనా కూడా పాక్‌కు కాశ్మీర్ అంశంపై వత్తాసు పలుకుతోంది.

కాగా, చైనా ఇంతకముందు పాకిస్తాన్ రాసిన లేఖకు స్పందిస్తూ యూఎన్ఎస్‌సీ అజెండాలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పుకొచ్చింది. ఇక దీనిపై ఎలాంటి చర్చా జరగకుండానే ఐరాసలోని చైనా రాయబారి ఝంగ్ జున్ ఏకంగా పాకిస్తాన్ లేఖను భద్రతా మండలి అధికారిక తీర్మానంలాగా ప్రచారం చేశారు. ఒక పక్క కోవిడ్ 19తో ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతుంటే.. ఈ విషయంపై ఇప్పటివరకు యూఎస్‌ఎస్‌సీలో చైనా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీనిపై సభ్యదేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐరాస భద్రతా మండలిలో కరోనా వైరస్‌పై చర్చ జరగడం చైనాకి ఏమాత్రం ఇష్టం లేదని.. ఒకవేళ జరిగితే ఈ మహమ్మారి వ్యాప్తిపై సంచలన నిజాలు బయటికి వస్తాయని డ్రాగన్ కంట్రీ భయపడుతోందని మిగిలిన దేశాలు భావిస్తున్నాయి.

ఇవి చదవండి:

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

లాక్ డౌన్ పొడిగిస్తే.. ముందు వీటిని సమకూర్చండి.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్..