తెలంగాణలో కొత్తగా 1,432 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే తక్కువ కేసులు నమోదయ్యాయి.

  • Balaraju Goud
  • Publish Date - 9:16 am, Thu, 15 October 20
తెలంగాణలో కొత్తగా 1,432 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే తక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు 38,895 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,432 కొవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,17,670కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే కరోనా బారినపడి 8 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,249కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక కరోనానుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నిన్న 1,949 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,93,218కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 19,084 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 37,03,047 మందికి కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహించారు.