బ్రేకింగ్ న్యూస్: రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 10 నుంచి.. రూ. 50కి పెంపు…

కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వేల సంఖ్యలో మునుషులను మింగేస్తూ మృత్యునాదం చేస్తోంది. దీంతో ప్రభుత్వాలు  యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించాయి. భారత ప్రభుత్వం కూడా అనేక మార్గాల ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. జనాలు గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. […]

బ్రేకింగ్ న్యూస్: రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 10 నుంచి.. రూ. 50కి పెంపు...
Follow us

|

Updated on: Mar 17, 2020 | 5:59 PM

కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వేల సంఖ్యలో మునుషులను మింగేస్తూ మృత్యునాదం చేస్తోంది. దీంతో ప్రభుత్వాలు  యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించాయి. భారత ప్రభుత్వం కూడా అనేక మార్గాల ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. జనాలు గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50 కు పెంచింది. దేశంలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే మొత్తం 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్ ‌ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. పెంచిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగుతాయని రైల్వే శాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది.  రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది రైల్వే శాఖ.