ఎమ్మెల్యేలకు, ఉద్యోగులకు “మహా” ఇచ్చిన షాక్ చూస్తే..

దేశ వ్యాప్తంగా కరోన విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు వారాల పాటు.. (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బుందులు పడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర […]

ఎమ్మెల్యేలకు, ఉద్యోగులకు మహా ఇచ్చిన షాక్ చూస్తే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 6:42 PM

దేశ వ్యాప్తంగా కరోన విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు వారాల పాటు.. (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు.. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బుందులు పడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు భారీ షాకిచ్చింది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో భారీ కోతకు సిద్ధమైంది. సీఎం ఉద్ధవ్ థాకరే నుంచి గ్రామ పంచాయతీ సభ్యుల వరకు.. అందరికీ జీతాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

వీరిని క్లాస్ ఎ, క్లాస్ బి అంటూ.. పలు విభాగాలుగా గుర్తించి. ఒక్కొ విభాగానికి ఒక్కోరకంగా కోతలు విధిస్తోంది. క్లాస్ ఎ, క్లాస్ బి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కట్‌ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. క్లాస్-సి లోని క్లరికల్ ఉద్యోగులకు.. 25శాతం కోత విధిస్తున్నట్లు తెలిపారు. ఇక క్లాస్- డి ఉద్యోగులైన ప్యూన్లు, ఆఫీసు అసిస్టెంట్ల జీతాల్లో మాత్రం ఎటువంటి కోత ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో.. అంతా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్టు అజిత్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు.