భారత్‌లో 10వేల మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య‌ 10వేలు దాటిపోయింది. ఇప్పటివరకు కోవిడ్-19తో మొత్తం 339మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గ‌డిచిన 24 గంటల వ్యవధిలో దేశ‌వ్యాప్తంగా 1,211 కొత్త కేసులు నమోదుకాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌జంట్ ఇండియాలో 1035 మంది కరోనా నుంచి కోలుకోగా… 8988 మంది కోవిడ్ తో బాధపడుతూ ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌కరంగా 2000 మార్కును దాటేసింది . […]

Follow us

|

Updated on: Apr 14, 2020 | 12:47 PM

దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య‌ 10వేలు దాటిపోయింది. ఇప్పటివరకు కోవిడ్-19తో మొత్తం 339మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గ‌డిచిన 24 గంటల వ్యవధిలో దేశ‌వ్యాప్తంగా 1,211 కొత్త కేసులు నమోదుకాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌జంట్ ఇండియాలో 1035 మంది కరోనా నుంచి కోలుకోగా… 8988 మంది కోవిడ్ తో బాధపడుతూ ఐసోలేషన్ వార్డుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌కరంగా 2000 మార్కును దాటేసింది . అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టంతో..ప్ర‌ధాని మే 3వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించిన సంగ‌తి తెలిసిందే.