Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • ఆహా OTT లో సరికొత్త షో మెట్రో కధలు. ఈనెల 14 నుండి ప్రారంభం. 4 కధలను చెబుతున్న డైరెక్టర్ కరుణ కుమార్. గతంలో పలాస సినిమా డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ . మెట్రో కధలు పోస్టర్ లాంచ్ చేసి యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పిన హరీష్ శంకర్. సాహిత్యానికి సినిమా కి దగ్గర సంభందం ఉందన్న దర్శకుడు కరుణ కుమార్.
  • విజయవాడ: బీజేపీ నుండి మరో నేత సస్పెండ్. పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడుతున్న వారిని వరసగా సస్పెండ్ చేస్తున్న బిజెపి. ఇప్పటికే పలువురు నేతలు సస్పెండ్.. మరి కొంత మందికి నోటీసులు ఇచ్చిన ఏపీ బీజేపీ. లేటెస్ట్ గా మరొకరు తిరుపతి కి చెందిన ఓ వి రమణ సస్పెండ్. మూడు ముక్కలాట లో నష్టపోతున్న బీజేపీ అని ఒక దిన పత్రికలో ఆర్టికల్ రాసిన తిరుపతి కి చెందిన బీజేపీ నేత ఓ వి రమణ .
  • అమరావతి: ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. ఆక్వా అభివృద్ధి, ఆక్వా కల్చర్ మానిటర్, ప్రమోట్, రెగ్యులేషన్ లక్ష్యాలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు..పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం ప్రదర్శిస్తూ..బుసలు కొడుతున్న కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది.
coronavirus : two states update., తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు..పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం ప్రదర్శిస్తూ..బుసలు కొడుతున్న కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ రోజుకూ వెయ్యి నుంచి 2000 చేరువగానే కొత్తకేసులు నమోదువుతున్నాయి. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 36,221కు చేరింది. కాగా, ఏపీలోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31,103కి చేరింది.
తెలంగాణ:
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభణ కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 1,550 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 36,221కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 926 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే బయటపడినట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 212 మందికి వైరస్‌ సోకింది. ఇక ఆ తర్వాత అత్యధిక కేసులతో కరీంనగర్‌ ముందు వరుసలో ఉంది.

కరీంనగర్‌లో ఏకంగా 86 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తరువాతి స్థానంలో మేడ్చల్‌ 53, నల్గొండ జిల్లాలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహాబూబాబాద్‌, మహాబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 చొప్పున కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక, భద్రాద్రి, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో పదేసి కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి వైరస్‌ సోకింది. భూపాలపల్లి, పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో ఆరు కేసులు… యాదాద్రి, గద్వాల్‌ జిల్లాల్లో 5 కొత్త కేసులు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ముగ్గురు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారు. నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం 1,197 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యిన వారి సంఖ్య 23,679కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరో 9 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 365కి చేరింది. సోమవారం మరో 11, 525 మందికి పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య.. లక్షా 81, 849 మంది చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్:
అటు, ఏపీలోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సోమవారం 1919 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ని పరీక్షించగా 1919 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 28,255. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,275కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 13,615 మంది చికిత్స పొందుతున్నారు.

Related Tags