Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోన్న ఈ చిన్న గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..

Coronavirus: This small Maharashtra village has become the first isle in the world to go into self-isolation, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోన్న ఈ చిన్న గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే దీని బారినపడి 18 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగున్నర లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 600 వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. మూడు వారాల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసరమయ్యే వాటికి మాత్రమే మినహాయింపునిచ్చారు.

అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ.. ఈ వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాల్సిందే. అయితే ఇలా చేయని కారణంగానే అనేక దేశాలు ఇప్పుడు కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయి. అయితే తాజాగా మన దేశంలోని ఓ గ్రామం ప్రపంచ
దేశాలన్నింటికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకొంది మహారాష్ట్రలోని ముంబై నగరం సమీపంలోని చిన్న ద్వీపమైన పంజూ గ్రామం. థానే జిల్లాలోని వాసాయి మండల పరిధిలో ఉంటుంది ఈ పంజూ గ్రామం. ఇది ఓ చిన్న దీవి. ఇక్కడి గ్రామంలో మొత్తం 1400 మంది జనాభా ఉంటారు.
గ్రామం మొత్తం పచ్చని పంట పొలాలతో.. కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. దీంతో ఈ గ్రామంలో రైతు కూలీలు ఎక్కువగా ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. ఆ గ్రామంలోని రైతు కూలీలం పనులు సైతం మానుకొని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

అంతేకాదు.. ఆ గ్రామస్థులు ఇతరులను కూడా ఎవ్వర్ని రానివ్వడం లేదు. గ్రామంలోకి పర్యాటకులు ఎవరూ రాకుండా నిషేధం విధించినట్లు ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ పంజూ నుంచి నైగావ్ సబర్బన్‌కు వెళ్లాలంటే పడవ మార్గం ఒకటే ఉంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో..పడవల రాకపోకలను కూడా నిలిపివేశారు. మొత్తానికి మహారాష్ట్రలో కరోనా వ్యాపిస్తోన్న తరుణంలో.. ఇలా ఓ చిన్న గ్రామం మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్ వెళ్లి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Related Tags