బెంగళూరు మెట్రో కార్మికులు 80 మందికి కరోనా

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ వికృత రూపం దాల్చుతోంది. తాజాగా బెంగళూరు మెట్రో ఫేజ్‌-2 పనులు చేస్తున్న కార్మికులకు 80 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

బెంగళూరు మెట్రో కార్మికులు 80 మందికి కరోనా
Follow us

|

Updated on: Jul 14, 2020 | 9:41 PM

కరోనా విస్తరణతో కర్ణాటక అల్లాడిపోతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో జనం విలవిలలాడుతున్నారు. మరోసారి కేసుల సంఖ్య పెరగుతుండడంతో ప్రభుత్వ, పైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ లోకి వెళ్తున్నాయి. అటు కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ వికృత రూపం దాల్చుతోంది. తాజాగా బెంగళూరు మెట్రో ఫేజ్‌-2 పనులు చేస్తున్న కార్మికులకు 80 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం 200 మంది కార్మికుల్లో 80 మందికి కరోనా సోకినట్లు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారి తెలిపారు. వీరందరిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించామని చెప్పారు. మిగిలినవారిని హోంక్వారంటైన్ లో ఉంచినట్లు వెల్లడించారు. మెట్రో పనులు చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా రావడంతో.. అప్రమత్తమైన అధికారులు మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. దీంతో 80 మంది కార్మికులకు ఈ వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో బెంగళూరు మెట్రో ఫేజ్‌-2 పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా కార్మికులందరూ కరోనా పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.