విజయవాడను గడగడలాడిస్తోన్న కరోనా..ఇద్దరి నుంచి అరవై మందికి

విజయవాడలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. రెడ్‌జోన్‌లలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలోనే 177 పాజిటివ్‌ కేసులు ఉంటే, ఒక్క విజయవాడలోనే 150 కేసులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇందులో ఇద్దరి వల్లే 60 కేసులు రావడం మరింత కలవరం కలిగిస్తోంది. మరో 41 కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మూలాలున్నాయి. కొందరికి వైరస్‌ ఎలా వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. కృష్ణలంక, కార్మికనగర్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కృష్ణలంకలో […]

విజయవాడను గడగడలాడిస్తోన్న కరోనా..ఇద్దరి నుంచి అరవై మందికి
Follow us

|

Updated on: Apr 27, 2020 | 12:28 PM

విజయవాడలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. రెడ్‌జోన్‌లలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలోనే 177 పాజిటివ్‌ కేసులు ఉంటే, ఒక్క విజయవాడలోనే 150 కేసులు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పైగా ఇందులో ఇద్దరి వల్లే 60 కేసులు రావడం మరింత కలవరం కలిగిస్తోంది. మరో 41 కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మూలాలున్నాయి. కొందరికి వైరస్‌ ఎలా వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. కృష్ణలంక, కార్మికనగర్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కృష్ణలంకలో లారీ డ్రైవర్‌ ద్వారా 24 మందికి కరోనా సోకింది. అతడు పేకాట ఆడటంతో వైరస్‌ వ్యాప్తి చెందింది. మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఓ యువకుడి ద్వారా 36 మందికి కరోనా అంటుకుంది. స్థానికంగా టిఫిన్‌ దుకాణం నడుపుతున్నాడా యువకుడు.

మరో పది మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా రెడ్‌జోన్‌లలో పని చేసిన వారే!. పాజిటివ్‌ వచ్చినవారిలో ఒక ఏడీసీపీ, ఒక మహిళా ఎస్సై, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరో ఎస్సైకి రెండురోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. విజయవాడలోని రెడ్‌జోన్లలో పనిచేస్తూ ఏడీసీపీ సహా ఎక్కువమంది వైరస్‌ బారిన పడ్డారు. నిన్న జిల్లాలో కొత్తగా 52 కేసులు వస్తే .. ఒక్క విజయవాడలోనే 47 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. గాంధీనగర్‌లో ఓ వృద్దురాలు మృతి చెందింది. ఆమె అంత్యక్రియలలో పాల్గొన్న అయిదుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇలా ఒకే చోటు నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఆయా ప్రాంతాలలో మరింత కఠినంగా ఆంక్షలను అమలుచేస్తున్నారు పోలీసులు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.