రెండు లక్షలకు చేరువలో భారత్

దేశంలో కరోనా ఉద్ధృతికి తెరపడట్లేదు. రోజురోజుకూ మరింత తీవ్రతతో ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో 8171 తాజా కేసులు వెలుగుచూడటంతో మంగళవారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,98,706కు చేరింది. 204 తాజా మరణాలతో మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 5,598కి పెరిగింది. కరోనా వైరస్‌ నుంచి ఇప్పటివరకూ 95,526 మంది కోలుకోగా 97,581 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల […]

రెండు లక్షలకు చేరువలో భారత్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 02, 2020 | 2:13 PM

దేశంలో కరోనా ఉద్ధృతికి తెరపడట్లేదు. రోజురోజుకూ మరింత తీవ్రతతో ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో 8171 తాజా కేసులు వెలుగుచూడటంతో మంగళవారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,98,706కు చేరింది. 204 తాజా మరణాలతో మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 5,598కి పెరిగింది. కరోనా వైరస్‌ నుంచి ఇప్పటివరకూ 95,526 మంది కోలుకోగా 97,581 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,706 దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 97,581 దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,598 క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 95,526

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మూడు రాష్ట్రాల్లోనే లక్ష కేసులు నమోదైనట్లుగా తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 67,655, తమిళనాడులో 22,333, ఢిల్లీలో 19,844 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్యలో మన దేశం ఏడో స్థానంలో కొనాసాగుతోంది. కానీ మరణాల సంఖ్యలో టాప్‌ 10 జాబితాలో మాత్రం లేదు. కేసుల సంఖ్యలో టాప్‌10లో లేని దేశాలు మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌10 జాబితాలో దూసుకుపోతున్నాయి.