Breaking News
  • పరువు హత్య కేసులో పోలీసుల అలసత్వం. 100 కి ఫోన్ చేసినా పట్టించుకోని గచ్చిబొలి పోలీసులు. అవంతి, హేమంత్ లను నిన్న గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసిన అవంతి తండ్రి పంపిన సుపారి గ్యాంగ్. కారు లో నుంచి దూకి పారిపోయి 100కి సమాచారం ఇచ్చిన అవంతి. సకాలంలో స్పందించని గచ్చిబౌలి పోలీసులు. ఆలస్యం చేయడం తో హేమంత్ ని సంగారెడ్డి తీసుకుని వెళ్లి హత్యచేసిన సుపారి గ్యాంగ్. రాత్రి కి తేరుకొని విచారన జరిపి అవంతి తండ్రి ఇచ్చిన సమాచారం తో సంగారెడ్డి లో మృతదేహాన్నీ గుర్తించిన పోలీసులు. ప్రస్తుతంఉస్మానియా మార్చురీ లో హేమంత్ మృతదేహం.
  • మంచు లక్ష్మి ట్వీట్‌ :బాలు కోలుకోవాలని మంచు లక్ష్మి ట్వీట్‌ .మా అందరి కోసం ఈ కష్టాన్ని అధిగమించడానికి పోరాడండి అని ట్వీట్.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ఉద్వేగభరిత వాతావరణం. ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్. చికిత్సకు బాలసుబ్రమణ్యం స్పందించడం లేదంటున్న ఆసుపత్రికి వర్గాలు. మరింత విషమంగా ఆరోగ్యం. ఆయనకు చికిత్స అందిస్తున్న ఆరుగురు వైద్యుల బృందం. మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారంటున్న ఆసుపత్రి వర్గాలు. కరోనా కారణంగా ఆసుపత్రి వద్దకు ఎవరూ రావొద్దని సూచిస్తున్న ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి దగ్గరకు వచ్చి బాలు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని వెళ్లిపోతున్న అభిమానులు. ఎంజీఎం ఆసుపత్రికి వెల్లువెత్తుతున్న ఫోన్లు. బాలు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రముఖులు, అభిమానుల ఫోన్లు. మరికాసేపట్లో ఆసుపత్రికి రానున్న దర్శకుడు భారతీరాజా.
  • కడపజిల్లా :వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేస్ లో విచారణ. కడప సెంట్రల్ జైల్ కేంద్రం గా కొనసాగుతున్న సీబీఐ విచారణ. ఈ రోజు మరో సారి చెప్పుల షాప్ యజమాని మున్నా ని ప్రశ్నించనున్న సీబీఐ. నిన్న సుదీర్ఘంగా మున్నాని 8 గంటల పైగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు. మున్నా తో పాటు పులివేందులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య ,నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులు లను ప్రశ్నించిన సీబీఐ. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న సీబీఐ. నిన్న మొత్తం 8 మంది ని విచారించిన సిబిఐ అధికారులు. చెప్పుల షాప్ యజమాని మున్నా స్నేహితులను కూడా పులివెందుల లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు. పులివెందుల కి చెందిన రియల్ ఎస్టేట్ పుల్లయ్య ని దాదాపు 7 గంటల పైగా ప్రశ్నించిన సీబీఐ. మున్నా అనే వ్యక్తి పుల్లయ్య కి ఎలా పరిచయం,ఎన్ని రోజులు గా పరిచయం అనే కోణం లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య ని సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. పుల్లయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న సీబీఐ.
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీరియస్. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం. ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు.
  • విశాఖ : విశాఖ నుండి ఒరిస్సాకు నేటి నుండి పునః ప్రారంభమైన RTC బస్సులు . విశాఖ నుండి గుణుపూర్, నవరంగపూర్, ఒనకడిల్లీ, పర్లాఖెముండి, ధవన్ జోడీ, జైపూర్ ప్రాంతాలకు నడవనున్న బస్ లు.

ఏపీలోని చిన్న చిన్న పట్టణాలకు వ్యాపిస్తున్న కరోనావైరస్: సజ్జల

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Coronavirus spreading to small towns in AP, ఏపీలోని చిన్న చిన్న పట్టణాలకు వ్యాపిస్తున్న కరోనావైరస్: సజ్జల

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటింకి తిరిగి సర్వే చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చినవారు ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.

ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న పది, పదిహేను రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. అదే విధంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చేసే రాజకీయాలు మానుకోవాలని చురకలు అంటించారు. తెలుగుదేశంపార్టీ నేతలు దిక్కుమాలిన, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసని….. పసుపు కుంకుమ పేరుతో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని వివరించారు సజ్జల. అప్పుల భారం, వేలకోట్ల పెండింగ్ బిల్లులు రాష్ట్రానికి మిగిల్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

చంద్రబాబు 40 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారని… ఇక ఇప్పుడేమో డబ్బులు ఉండి కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని చంద్రబాబు మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లలును కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుందని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లింపు చేసింది 800 కోట్ల రూపాయలు మాత్రమేనని….. మేము బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్లు కూడా ఎవరికి దగ్గరో అందరికి తెలుసన్నారు సజ్జల. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి జీతాల చెల్లింపు వాయిదా వేశామని….. అత్యవసర సమయంలో ఉద్యోగులు వారి ఔదార్యాన్ని చాటుకుంటున్నారని వివరించారు. ఉద్యోగులను కించపరిచే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Related Tags