క‌రోనా, సార‌స్‌..సహా ఐదు మ‌హ‌మ్మారుల‌కు చైనాయే కార‌ణం..!

కరోనాకు, అంతకు ముందు అనేక వైరస్‌లకు కూడా చైనా కారణమని అమెరికా విమర్శించింది. గత 20 సంవత్సరాల్లో సుమారు 5 మహమ్మారులు చైనా నుంచే వచ్చాయని,

క‌రోనా, సార‌స్‌..సహా ఐదు మ‌హ‌మ్మారుల‌కు చైనాయే కార‌ణం..!
Follow us

|

Updated on: May 13, 2020 | 4:44 PM

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తికి కార‌ణం చైనాయే అంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మొద‌టి నుంచి ఆరోపిస్తున్నారు. స‌మ‌యం దొరికిన ప్ర‌తిసారి ట్రంప్ చైనా పట్ల తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. అమెరికా పట్ల, తక్కిన ప్రపంచం పట్ల చైనా చేసిన నిర్వాకానికి మూల్యం చెల్లించాల్సిందే అంటూ ప‌దేప‌దే మండిప‌డుతున్నారు. తాజాగా వైట్‌హౌజ్ వేదిక‌గా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది అగ్ర‌రాజ్యం అమెరికా. ఒక్క క‌రోనాయే కాదు..ఇటువంటి భ‌యంక‌రమైన ఐదు వైర‌స్‌ల‌ను చైనాయే ఉత్ప‌న్నం చేసి ప్ర‌పంచం మీద‌కు వ‌దిలింద‌ని ఆరోపించింది.

కరోనాకు, అంతకు ముందు అనేక వైరస్‌లకు కూడా చైనా కారణమని అమెరికా విమర్శించింది. గత 20 సంవత్సరాల్లో సుమారు 5 మహమ్మారులు చైనా నుంచే వచ్చాయని, దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రయాన్‌ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మందిని పొట్టన బెట్టుకున్న కరోనా మహమ్మారికి   చైనాదే బాధ్యత అన్నారు. ‘చైనా నుంచి వచ్చే ఈ మహమ్మారులను ఇక ఎంతమాత్రం భరించలేం’ అని ప్రపంచ ప్రజలు ఉవ్వెత్తున లేచి చైనా ప్రభుత్వానికి ముక్తకంఠంతో తెలియజేస్తారని ఓ బ్రయాన్‌  వైట్‌హౌస్‌లో విలేఖరులతో వెల్ల‌డించారు.