చైనాలో మరో కలవరం.. రూపు మారుతున్న కరోనా..!

ప్రపంచదేశాలనే సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్‌ మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విరుచుకుపడుతోంది. కోలుకుంటున్న ప్రాంతంలో మళ్లీ కబళిస్తూ కొత్త రూపు సంతరించుకుంటుందా..? ఇదీ నిజమేనంటున్నారు చైనా వైద్య నిపుణులు. కొవిడ్ -19 పుట్టినిల్లైన చైనాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 33 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో 31 కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. దీంతో అక్కడి అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. కరోనావైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన వుహాన్ […]

చైనాలో మరో కలవరం.. రూపు మారుతున్న కరోనా..!
Follow us

|

Updated on: May 21, 2020 | 3:55 PM

ప్రపంచదేశాలనే సంక్షోభంలోకి నెట్టిన కరోనావైరస్‌ మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విరుచుకుపడుతోంది. కోలుకుంటున్న ప్రాంతంలో మళ్లీ కబళిస్తూ కొత్త రూపు సంతరించుకుంటుందా..? ఇదీ నిజమేనంటున్నారు చైనా వైద్య నిపుణులు.

కొవిడ్ -19 పుట్టినిల్లైన చైనాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 33 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో 31 కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. దీంతో అక్కడి అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. కరోనావైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన వుహాన్ సిటి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దాదాపు రెండున్నర నెలలపాటు లాక్ డౌన్ లో ఉన్న నగరంలో కరోనా కేసులు తగ్గుమొఖం పట్టడంతో రెగ్యూలర్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. అయితే, మహమ్మారీ మళ్లీ ప్రబలకుండా అధికారులు.. ప్రజలందరికీ ర్యాండమ్ గా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న వారిలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించకుండానే నమోదవుతున్నాయి. దాంతో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు చైనా వైద్య నిపుణులు. ఇక ఈసారి నమోదవుతున్న కేసులు వుహాన్ సిటీతో పాటు గాంగ్ డాంగ్, షాంఘై ప్రావిన్సుల్ ప్రాంతాలు కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయాన్ని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ కేసులు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సోకినట్లు ఎన్ హెచ్ సీ తెలిపింది. ఇక వుహాన్ నగరంలో నమోదవుతున్న కేసులు మాత్రం ఇదివరకటి కంటే భిన్నంగా కరోనా వైరస్ విస్తరిస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్నే కుదుపేసిన ఈ రాకాసి భవిష్యత్ లో ఎన్ని అనర్థాలు సృష్టిస్తోందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..