కరోనాపై కుళ్లు జోకులు-ఐదేళ్లపాటు జైలుపాలు

ప్రాంక్‌ వీడియోలు ఎప్పుడుపడితే అప్పుడు తీయకూడదు.. సమయం సందర్భం చూసుకోవాలి.. అసలే కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.. అలాంటి కరోనా వైరస్‌…సారీ కోవిడ్‌-19పై ఓ కుర్రాడు అత్యుత్సాహంతో ప్రాంక్‌ వీడియో చేసి జైలుపాలయ్యాడు.. రష్యాలోని మాస్కో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది… తజకిస్తాన్‌కు చెందని కరోమాత్‌ ఝబరావ్‌ అనే ఓ యువకుడు … అతడి దోస్తులు మాస్కో రైల్లో ఓ ప్రాంక్‌ వీడియో తీయాలని ముచ్చటపడ్డారు.. తీస్తే తీశారు కానీ వారెంచుకున్న […]

కరోనాపై కుళ్లు జోకులు-ఐదేళ్లపాటు జైలుపాలు
Follow us

|

Updated on: Feb 12, 2020 | 3:42 PM

ప్రాంక్‌ వీడియోలు ఎప్పుడుపడితే అప్పుడు తీయకూడదు.. సమయం సందర్భం చూసుకోవాలి.. అసలే కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.. అలాంటి కరోనా వైరస్‌…సారీ కోవిడ్‌-19పై ఓ కుర్రాడు అత్యుత్సాహంతో ప్రాంక్‌ వీడియో చేసి జైలుపాలయ్యాడు.. రష్యాలోని మాస్కో అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది… తజకిస్తాన్‌కు చెందని కరోమాత్‌ ఝబరావ్‌ అనే ఓ యువకుడు … అతడి దోస్తులు మాస్కో రైల్లో ఓ ప్రాంక్‌ వీడియో తీయాలని ముచ్చటపడ్డారు.. తీస్తే తీశారు కానీ వారెంచుకున్న సబ్జెక్టే బాగోలేదు.. మాస్క్‌ పెట్టుకుని రైలెక్కిన కరోమాత్‌ కాసేపటికి కిందపడి గిలగిలకొట్టుకున్నాడు.. వెంటనే అతడి ఫ్రెండ్స్‌ వచ్చి కరోనా వైరస్‌ సోకిందంటూ భయపడినట్టు నటించేశారు.. ఆపై అక్కడ్నుంచి పరుగులు పెట్టారు.. నిజమే కాబోలనుకున్న ప్రయాణికులు కూడా అతడి నుంచి దూరంగా పరుగెత్తారు.. కాసేపటి తర్వాత తూచ్‌… అంతా ఉత్తిదే… ఇదంతా ప్రాంక్‌ వీడియలో భాగమని చెప్పాడు కరోమాత్‌… ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు కూడా చేశారు.. పాపం ప్రయాణికులు ఏం చేయలేక మనసులో తిట్టుకున్నారు.. కానీ పోలీసులు అలా కాదుగా… మెట్రో రైలులో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసినందుకు కరోమత్‌ను .. అతడి ఫ్రెండ్స్‌ను కోర్టుకు లాగారు.. అంతా విన్న కోర్టు జోకులకో హద్దుండొద్దూ అని చివాట్లేసి… అయిదేళ్లు జైలు శిక్ష విధించింది… పైగా ఆ వీడియోను వెంటనే సోషల్‌ మీడియాల్లోంచి తొలగించాల్సిందిగా ఆదేశించింది… ఈ బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను నలుగురికి చెప్పేందుకే ఈ ప్రాంక్‌ వీడియోను చేశారనీ.. ఇలా ఎదురుతిరుగుతుందని అనుకోలేదనీ ఆ యువకుడి లాయర్‌ చెప్పుకొచ్చాడు…

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..